- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం బర్త్ డే ఘనంగా జరపండి.. సర్క్యులర్ జారీ
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని తెలంగాణ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉన్నాతాధికారులు సర్కులర్ జారీ చేశారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న రాష్ట్రంలోని అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్లలో మొక్కలు నాటడం, రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పేరుతో గురువారం అన్ని జిల్లాల మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లకు సర్క్యులర్ జారీ చేశారు.
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ 69వ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధం అవుతున్నారు. ఈసారి వినూత్నంగా కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులోని థ్రిల్ సిటీలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 69 కేజీల కేక్ కట్ చేయడంతో పాటు కేసీఆర్ జీవితంలోని కీలక మైలురాళ్లను, గత ఎనిమిదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను తెలిపేలా 3డీ గ్రాఫిక్స్‌తో కూడిన డాక్యుమెంటరీని ప్రదర్శించబోతున్నారు.