- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పతాగి ‘సీఐ’ వీరంగం.. రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం
దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ బొల్లారంలో ఇవాళ తెల్లవారుజామున ఓ పోలీసు సీఐ తప్పతాగి కారు నడిపి వీరంగం సృష్టించారు. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న కూరగాయల లోడ్‌తో ఉన్న వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో కూరగాయల లోడ్‌తో వెళ్తున్న వాహన డ్రైవర్ శ్రీధర్‌కు గాయాలయ్యాయి. దీంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అయితే సీఐ శ్రీనివాస్ ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. డీఎస్పీ ప్రమోషన్ లిస్ట్‌లో కూడా ఆయన పేరు ఉన్నట్టుగా తెలుస్తోంది. సీఐ మద్యం మత్తులో ఉన్నారని.. ఆయనకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయమంటే పోలీసులు తొలుత నిరాకరించారని శ్రీధర్ సంబంధికులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాన్వాయ్‌తో సీఐ వచ్చారన్నారు. దీంతో తాము నిరసనకు దిగామని, రెండు గంటల తర్వాత సీఐకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే.. 210 రీడింగ్ వచ్చిందని పేర్కొన్నారు. సీఐ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, సీఐ శ్రీనివాస్ వాహనంపై ఆరు ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా ఉన్నాయి.