హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ పై చీకోటి సంచలన వ్యాఖ్యలు.. అతడి వ్యవహారం తేల్చాలని డీజీపీకి ఫిర్యాదు

by Prasad Jukanti |
హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ పై చీకోటి సంచలన వ్యాఖ్యలు.. అతడి వ్యవహారం తేల్చాలని డీజీపీకి ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు వ్యవహారం, ఆయన అక్రమ ఆస్తులపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. బీఆర్ఎస్ అండదండలతో రాధాకిషన్ రావు రెచ్చిపోయి అనేక అరాచకాలకు పాల్పడ్డారని, నాపై ఈడీ కేసు నమోదు అవ్వగానే నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి నా కదలికలను కనిపెట్టారని ఆరోపించారు. కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో శివాజీ విగ్రహం సంఘటన సమయంలో తాను అక్కడికి వెళ్తే నాకు రాధాకిషన్ రావు నేరుగా ఫోన్ చేసి పీడీ యాక్టులు పెడతామంటూ బెదిరించారని, కేసులు పెట్టకుండా ఉండాలంటే భారీగా నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోయే సరికి అమ్మవారి టెంపుల్ కు వచ్చిన నా అనుచరుల వద్ద గన్స్ ఉన్నాయంటూ నాపై రాధాకిషన్ రావు అక్రమంగా కేసులు పెట్టించారని నా ఫామ్ హౌస్ పై రెయిడ్స్ చేసి డ్రగ్స్ కేసులు పెడతామని బెదిరించారని ఆరోపించారు. సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు తెలిసిందని హీరోయిన్స్ ఫోన్లు ఎందుకు ట్యాపింగ్ చేశారో చెప్పాలన్నారు. రాధాకిషన్ రావుకు వందల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ఆస్తులపై ఈడీ, సీబీఐ విచారణ చేయించాలని కోరారు. రాధాకిషన్ రావు బాధితులు ఎవరైనా ఉంటే బయటకు రావాలని వారికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందన్నారు.

Advertisement

Next Story