Davos WEF : దావోస్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాటా ముచ్చట

by M.Rajitha |
Davos WEF : దావోస్ లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మాటా ముచ్చట
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana), ఏపీ(AP) రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్(Davos) లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF)లో పాల్గొనడానికి జ్యూరిచ్ చేరుకున్న విషయం తెలిసిందే. జ్యూరిచ్ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బృందానికి జ్యూరిచ్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. కాగా అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరస్పర మర్యాదపూర్వక పలకరింపులు చేసుకున్నారు. అనంతరం రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, పథకాలు, కార్యక్రమాలపై కొద్దిసేపు వారివురు ముచ్చటించారు. కాగా దావోస్ సదస్సులో తొలిరోజున పలువురు విదేశీ పారిశ్రామికవేత్తలతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.

Next Story

Most Viewed