RS ప్రవీణ్ కుమార్ అంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది: CM రేవంత్ రెడ్డి

by GSrikanth |
RS ప్రవీణ్ కుమార్ అంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది: CM రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: బీఎస్‌పీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తాము పాలకులం కాదని.. సేవకులం అని అన్నారు. తులసివనం లాంటి తెలంగాణలో కేసీఆర్ కొన్ని గంజాయి మొక్కలు నాటి వెళ్లారని.. ప్రస్తుతం ఆ మొక్కలను ఏరిపారేసే పనిలో ఉన్నామని చెప్పారు. కేసీఆర్‌కు తన రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నారు. కేసీఆర్‌తో జతకట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే తనకు ఇంకా గౌరవం ఉందని వెల్లడించారు. ఇంకా ఆయన ఉద్యోగంలోనే ఉండుంటే.. ఇప్పుడు డీజీపీ అయ్యేవాడని కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ పదవి ఆఫర్ చేసినా ఆయన ఒప్పుకోలేదని చెప్పారు.

Advertisement

Next Story