రామోజీరావుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

by GSrikanth |
రామోజీరావుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. గంటకుపైగా రామోజీ రావుతో వివిధ అంశాలను చర్చించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్న తీరు, మారిన ప్రజాపాలన విధానాలపైనా మాట్లాడుకున్నారు. ప్రజాపాలన విధానాలు, సమకాలీన రాజకీయ పరిస్థితులు, లౌకికవాద పరిరక్షణ భవిష్యత్తులో అనుసరించాల్సిన వైఖరి, పార్టీలు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి, ఈనాడు ఎండీ కిరణ్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed