- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. ఆ రాష్ట్ర ఓటర్లను ఆకర్షించేలా ప్లాన్?
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకుని దశాబ్ధాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతి సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. వివిధ వర్గాలతో గంగా జమునా తహెజీబ్‌కు ప్రతీకగా కొనసాగుతున్న హైదరాబాద్ జీవన విధానాన్ని నిలుపుకునేందుకు కృషి చేసేలా సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైద్రాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్న కర్ణాటక వాసుల కోసం హైదరాబాద్‌లోని సాహిత్య వేదికను పునరుద్దరించాలని నిర్ణయించారు.
అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ విజ్జప్తి మేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ కాచిగూడలోని ‘కర్ణాటక సాహిత్య మందిర’ పునర్నిర్మాణం కోసం రూ.5 కోట్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కమ్యూనిటీ అవసరాల కోసం వినియోగించుకునే విధంగా మౌలిక వసతులను ఏర్పాటు చేసి ఆడిటోరియాన్ని తీర్చిదిద్దాలని స్థానిక ఎమ్మెల్యేతో పాటు అధికారులకు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. తమ విజ్ఞప్తి మేరకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ శుక్రవారం ప్రగతి భవన్‌లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
కేసీఆర్ నిర్ణయం వెనుక పొలిటికల్ వ్యూహం?:
కర్ణాటక సాహిత్య మందిర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వెనుక ఆసక్తికర చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాలు చేయాలని చూస్తున్న కేసీఆర్ త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ బరిలో తమ పార్టీ పోటీ చేస్తుందని గతంలో ప్రకటించారు. ఈ మేరకు అక్కడ బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు తెలంగాణలోనూ కర్ణాటక ప్రజలు చెప్పుకోదగిన సంఖ్యలో ఉపాధి నిమిత్తం వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నారు.
ఇటు తెలంగాణలోని కన్నడిగులతో పాటు కర్ణాటక అసెంబ్లీలో ఓట్లను రాబట్టుకునేందుకు కేసీఆర్ ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నారని అందులో భాగంగానే ఆ రాష్ట్ర ఓటర్లను ఆకట్టుకునే విధంగా కర్ణాటక సాహిత్య మందిర నిర్మాణం కోసం నిధులు కేటాయించారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కేసీఆర్ ఏది చేసినా దాని వెనుక పదునైన రాజకీయ వ్యూహం ఉంటుందనే అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో జరుగుతున్న ప్రచారం ప్రకారం కర్ణాటక సాహిత్య మందిర పునర్నిర్మాణం కేసీఆర్ కు ఏమేరకు కలిసి వస్తుందో చూడాలి మరి.