- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాబోయే ఎన్నికల్లో వందశాతం బీఆర్ఎస్సే గెలుస్తుంది: Telangana CM KCR
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక లక్షా 36 వేల మంది పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో గిరిజనులను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. 15 ఏళ్లుగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నట్లు గుర్తుచేశారు. తెలంగాణ వచ్చింది కాబట్టే.. కొమురంభీం అసిఫాబాద్ జిల్లా అయిందని అన్నారు. ఒకప్పుడు అంటు వ్యాధులతో ఆదిలాబాద్ తల్లడిల్లిందని గుర్తుచేశారు. అసిఫాబాద్‌కు మెడికల్ కాలేజీ వస్తుందని ఏనాడూ అనుకోలేదని తెలిపారు.
అలాంటి అసాధ్యమైన పనులు చేసుకుంటూ రాష్ట్రాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. పోడు భూములకు సంబంధించి రైతులపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో పోడు భూముల పట్టాల పంపిణీ పూర్తిగా జరుగుతుందని అన్నారు. అటవీ ప్రాంతాల్లో త్రీ-ఫేజ్ కరెంట్ సరఫరాకు ఆదేశాలు జారీ చేశారు. మరోసారి ధరణి ఉండాలా? వద్దా? అని రైతులను అడిగారు. ధరణి పోతే పట్టాలు ఇవ్వడానికి ఆరు నెలలు పడుతుందని అన్నారు. మళ్లీ దళారులు రాజ్యమేలుతారని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలన్నీ పేదల పథకాలే అని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ వందశాతం బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతోందని జోస్యం చెప్పారు.
Also Read..
KTR :సొంత ఎమ్మెల్యేకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించిన కేటీఆర్ (వీడియో)