'ఎట్‌ హోమ్'కు కేసీఆర్ దూరం.. 20 నిమిషాలు ఎదురుచూసిన గవర్నర్

by GSrikanth |   ( Updated:2022-08-15 14:28:24.0  )
ఎట్‌ హోమ్కు కేసీఆర్ దూరం.. 20 నిమిషాలు ఎదురుచూసిన గవర్నర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఎట్‌ హోమ్‌' కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గైర్హాజరు అయ్యారు. చివరి నిమిషంలో 'ఎట్ హోం' కార్యక్రమాన్ని కేసీఆర్ రద్దు చేసుకున్నారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా 'ఎట్‌ హోం' కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. సీఎం కేసీఆర్‌ కోసం గవర్నర్ తమిళిసై దాదాపు 20 నిమిషాల పాటు వేచి చూసినట్లు సమాచారం. కాగా, గత కొన్ని నెలలుగా గవర్నర్‌-కేసీఆర్‌ మధ్య కోల్డ్‌ వార్‌ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. గతకొన్ని రోజులుగా గవర్నర్‌ – ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్య దూరం పెరిగి, రాజ్‌భవన్‌ వైపు కన్నెత్తి చూడని కేసీఆర్‌ ఇటీవల హైకోర్టు కొత్త సీజే ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఆ సమయంలో గవర్నర్‌ను కేసీఆర్‌ అప్యాయంగా పలకరించారు. ఇప్పుడు గవర్నర్ నిర్వహించే కార్యక్రమానికి గైర్హాజరు కావడంతో వీరిద్దరి మధ్య మరింత వైరం పెరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల ఖమ్మం పర్యటనలో, ఢిల్లీ పర్యటనలో భాగంగా గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పరోక్షంగా రాజకీయ విమర్శలు సైతం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story