- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అట్టడుగు వర్గాల విద్యార్థుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
దిశ, తెలంగాణ బ్యూరో: అట్టడుగు వర్గాల విద్యార్థుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, అలాంటి విద్యార్థుల్లో ఎక్కువ మంది దళిత, ఆదివాసీ వర్గాలకు చెందిన వారేనని పరిశోధనల్లో వెల్లడైందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ తెలిపారు. శనివారం నల్సార్ లా యూనివర్సిటీ 19వ స్నాతకోత్సవంలో సీజేఐ చంద్రచూడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు పీహెచ్‌డీ, ఎల్ఎల్ఎం, బీఏ ఎల్ఎల్‌బీ (ఆనర్స్) తదితర విభాగాలకు డిగ్రీ పట్టాలు అందజేశారు. అనంతరం సీజేఐ చంద్రచూడ్ మాట్లాడుతూ.. దళిత, ఆదివాసీ విద్యార్థులు ఒత్తిడికి లోనై చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడించారు. వారిపై సానుభూతి లేకపోవడమే వివక్షకు కారణమని సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు. వారి విషయంలో ప్రభుత్వాలు, విద్యాసంస్థలు సరైన ప్రాధాన్యత కల్పించాలని అన్నారు.
న్యాయమూర్తులు ఇలాంటి వాటి పట్ల సరైన తీర్పులు వెలువరించాలని పిలుపునిచ్చారు. న్యాయస్థానాలకు వచ్చే విద్యార్థులు న్యాయం కోసం పనిచేయాలని సూచించారు. మహిళలు న్యాయస్థానంలో కీలక పాత్ర పోషించాలన్నారు. సమాజంలో చాలామంది న్యాయం కోసం చివరికి వచ్చేది న్యాయస్థానాలకేనని అన్నారు. న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల పాత్ర కీలకమైనదని, కోవిడ్ సమయంలో కూడా న్యాయమూర్తులు చాలా బాగా పనిచేశారని గుర్తుచేశారు. న్యాయ శాస్త్రం తెలుసుకునేందుకు ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులో ఉందన్నారు. న్యాయ విద్యకు సంబంధించి దేశంలో మరిన్ని విద్యా సంస్థలు రావాలని అన్నారు. ఈ సందర్భంగా న్యాయవాద డిగ్రీ పట్టాలు పొందిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
మొత్తం 58 బంగారు పతకాలు విద్యార్థులకు ముఖ్య అతిథులు అందజేశారు. పరిశోధనలో ప్రతిభ చూపిన అధ్యాపకులకు ప్రశంసా పత్రాల ప్రదానం చేశారు. పారిస్‌లో జరిగిన 18వ ఐసీసీ అంతర్జాతీయ వాణిజ్య మధ్యవర్తిత్వ పోటీల్లో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన జట్టు విద్యార్థులకు సైతం ప్రశంసా పత్రాల ప్రదానం చేశారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వీ రామ సుబ్రహ్మణ్యన్, జస్టిస్ పీఎస్ నరసింహ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్ ఉజ్జల్ భూయాన్, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఎస్ఎం ఖాద్రీ, జస్టిస్ పీవీ రెడ్డి, పలువురు సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 58 బంగారు పతకాలు విద్యార్థులకు ముఖ్య అతిథులు అందజేశారు. పరిశోధనలో ప్రతిభ చూపిన అధ్యాపకులకు ప్రశంసా పత్రాల ప్రదానం చేశారు.
పారిస్‌లో జరిగిన 18వ ఐసీసీ అంతర్జాతీయ వాణిజ్య మధ్యవర్తిత్వ పోటీల్లో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన జట్టు విద్యార్థులకు సైతం ప్రశంసా పత్రాల ప్రదానం చేశారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వీ రామ సుబ్రహ్మణ్యన్, జస్టిస్ పీఎస్ నరసింహ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్ ఉజ్జల్ భూయాన్, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఎస్ఎం ఖాద్రీ, జస్టిస్ పీవీ రెడ్డి, పలువురు సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.