వనస్థలిపురంలో చిరుత కలకలం..

by Vinod kumar |
వనస్థలిపురంలో చిరుత కలకలం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: వనస్థలిపురం‌లో చిరుతపులి కనిపించిందని పుకార్లు వినిపిస్తున్నాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే స్థానికులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది పరిసర ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి విష్ణువర్ధన్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. సాగర్ కాంప్లెక్స్ ఏరియాలో చిరుత కనిపించిందని నిన్న రాత్రి ఒక ఫోన్ కాల్ వచ్చిందని, వెంటనే అక్కడికి చేరుకొని చిరుతపులి ఆనవాళ్ల కోసం చూశామని తెలిపారు. రాత్రి ఉదయం కూడా పరిశీలించామని, ఎక్కడా కూడా చిరుత అడుగు జాడలు దొరకలేదని ఆయన స్పష్టం చేశారు.

చిరుత 24 గంటల్లో సుమారు 50 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని, ఒకవేళ ఉంటే ఇబ్రహీంపట్నం అడవి వరకు వెళ్లే అవకాశం ఉందని అక్కడి ఫారెస్ట్ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే బోన్లను కూడా సిద్ధంగా ఉంచినట్లు అన్నారు. కాలనీ వాసులు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని సూచించారు. రాచకొండ పోలీసుల సహకారంతో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని, ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటామని, ఒకవేళ చిరుత కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని తెలిపారు.

Advertisement

Next Story