- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పంజాబ్ రైతులకు చెక్కులు లిక్కర్ స్కాంలో భాగమే : Tarun Chugh
దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ మద్యం కుంభకోణం ఛార్జ్‌షీట్‌లో మరోసారి కవిత పేరు బయట పడడంపై తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజులలో మరిన్ని నిజాలు వెలుగు చూస్తాయన్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం అందరూ లిక్కర్ స్కాంలో ఉన్నారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తు తరహాలో తెలంగాణ, పంజాబ్ లిక్కర్ పాలసీ పైన దర్యాప్తు జరగాలన్నారు. కేసీఆర్ దోచుకున్న డబ్బు బయటపడకుండా ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చారని మండిపడ్డారు. అంతేకాకుండా తెలంగాణలో మొదలైన వీరి దోపిడీ , ఇప్పుడు దేశ రాజధానికి చేరిందని విమర్శించారు. వీరందరికీ కఠిన శిక్షలు పడాల్సిందేనని డిమాండ్ చేశారు. సమీర్ మహీంద్రుతో కలిసి దోపిడీ చేశారని అన్నారు. ఈ అంశంలో కేసీఆర్ మౌనం ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు. కుటుంబ రాజకీయాలు, అహంకారం, అవినీతి పరిపాలన టీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్య పథకాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లిక్కర్ స్కాం చార్జిషీట్‌లో కవిత పేరు 48 సార్లు ఈడీ ఎందుకు ప్రస్తావించిందో కేసీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత ఎందుకు ఇన్ని ఫోన్లు మార్చారో కూడా ప్రజలకు చెప్పాలని అన్నారు. మాఫియా తరహాలో ఫోన్లను ధ్వంసం చేశారని మండిపడ్డారు. సమీర్ మహేంద్రుతో కవితకు ఉన్న సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. కుటుంబ వాదంతో తెలంగాణను దోపిడీ చేసిన కేసీఆర్.. ఈ ప్రణాళికలో అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌ను కలిశారని తరుణ్ చుగ్ ఆరోపించారు. ఈ కేసు బోగస్ అయితే కుంభకోణంలో ఉన్న వారంతా, కవిత ఇంటికి ఎందుకు వచ్చారని నిలదీశారు. ఒబెరాయ్ హోటల్లో జరిగిన సమావేశం ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. పంజాబ్ రైతులకు చెక్కులు ఇవ్వడం ఒక సాకు మాత్రమే అని దాని వెనుక కూడా లిక్కర్ కుంభకోణం ఉందని తరుణ్ చుగ్ అన్నారు.
Also Read....