- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆయన నేత్రాలు సజీవం-నేత్ర దానం మహాదానం..
దిశ, వెబ్‌డెస్క్: నరగంలో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ లయన్ దుర్శెట్టి నిరంజనాచారి 93 ఏండ్ల తండ్రి వెంకటస్వామి వృద్ధాప్య సమస్యలతో తుది శ్వాస విడవడం విచారకరం. తండ్రి మరణాన్ని దిగమింగుకుంటూ తన సేవా గుణాన్ని ప్రదర్శించిన నిరంజనాచారి తన తండ్రి నేత్రాలను దానం చేయడానికి ముందుకు రావడం ప్రశంసనీయమని శాతవాహన లయన్స్ క్లబ్ బాధ్యులు తెలిపారు. శాతవాహన లయన్స్ క్లబ్ నేతృత్వంలో వెంకటస్వామి పార్థివ దేహం నుంచి నేత్రాలను సేకరించి హైదరాబాదులోని యల్. వి ప్రసాదు కంటి ఆసుపత్రికి పంపించడం జరిగింది.
మరణానంతరం కూడా వెంకటస్వామి దానం చేసిన రెండు నేత్రాలు మరో ఇద్దరికి కంటి చూపును ఇస్తున్నాయని క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ నేత్రదాన కార్యక్రమంలో శాతవాహన లయన్స్ క్లబ్ సభ్యలు లయన్ కెప్టెన్ బుర్ర మధుసూదన్ రెడ్డి, అధ్యక్షులు యస్. మనోహరాచారి, కార్యదర్శి మేకల అరవింద రావు, ఆర్‌సి ఇనుగుర్తి రమేష్, డా: సిహెచ్ రమణాచారి, తుమ్మల రమేష్ రెడ్డి, జి జనార్థన్ రెడ్డి తదితరులు పాల్గొని నిరంజనాచారి గారిని పరామర్శించారు. ఇలా నేత్ర దానం చేయాలనుకునే పౌరులు శాతవాహన లయన్స్ క్లబ్ బాధ్యులను సంపిరదించవలసిందిగా కోరనైనది.