రాజన్న సిరిసిల్లలో కలకలం.. 9 మంది పోలీస్ సిబ్బందిపై ఒకేసారి వేటు

by Sathputhe Rajesh |   ( Updated:2024-03-22 07:05:50.0  )
రాజన్న సిరిసిల్లలో కలకలం.. 9 మంది పోలీస్ సిబ్బందిపై ఒకేసారి వేటు
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : అవినీతి పోలీస్ అధికారులుపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఉక్కు పాదం మోపుతున్న విషయం తెలిసిందే. వీధుల పట్ల నిర్లక్ష్యానికి పాల్పడ్డ సిబ్బందిని సైతం వదలన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా వేములవాడలో ఒక వ్యవహారంలో అవినీతితో పాటు విధుల్లో నిర్లక్యంగా వ్యవహరించిన ఐదుగురు కానిస్టేబుళ్లు, నలుగురు హోంగార్డులను మొత్తం తొమ్మిదిమంది పోలీస్ సిబ్బందిని ఏఆర్ హెడ్ క్వార్టర్‌కు జిల్లా ఎస్పీ అటాచ్ చేసినట్లు సమాచారం. అవినీతి పాల్పడుతున్న పోలీసు అధికారులు, సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకుంటున్న జిల్లా పోలీస్ బాస్ తీరుపై జిల్లా ప్రజల హర్షం చేస్తున్నారు. సంస్థాగతమైన చర్యలు తీసుకోవడంతో పోలీసు వ్యవస్థ పైన ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed