మావోయిస్టుల అలజడి.. వాహనాలకు నిప్పు పెట్టడంతో కలకలం

by Sathputhe Rajesh |
మావోయిస్టుల అలజడి.. వాహనాలకు నిప్పు పెట్టడంతో కలకలం
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: మావోయిస్టులు రోడ్డు నిర్మాణం పనుల్లో ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ సంఘటన గడ్చిరౌలి జిల్లా ఎటపల్లి సమీపంలో జరిగింది. కొన్నిరోజులుగా సూరజ్ ఘడ్ - పారస్ ఘడ్ మధ్య రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాగా గురువారం రాత్రి మావోయిస్టులు దాడి చేసి ఓ ప్రొక్‌లైనర్‌తో పాటు ట్రాక్టర్, మరో వాహనానికి నిప్పు పెట్టారు. వారంలో ఇది రెండవ సంఘటన కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Advertisement

Next Story