అసెంబ్లీలో టిఫిన్ తిందామన్న ఛాంబర్ లేదు: ఎమ్మెల్యే ఈటల రాజేందర్

by Satheesh |
అసెంబ్లీలో టిఫిన్ తిందామన్న ఛాంబర్ లేదు: ఎమ్మెల్యే ఈటల రాజేందర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి అసెంబ్లీ ఛాంబర్ కేటాయించరా అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. చాంబర్ కేటాయించకుండా అవమాన పరుస్తున్నారన్నారు. బడ్జెట్‌పై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిఫిక్ బాక్స్ తెచ్చుకొని తిందామన్న ఛాంబర్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సీపీఎం, లోక్ సత్తా పార్టీలకు ఒక్క సభ్యుడు ఉన్నా ఛాంబర్ కేటాయించారని, ఇప్పుడు ముగ్గురు ఉన్నా కేటాయించకపోవడం అవమానించడమేనన్నారు. ఇది శాసనసభ కాదా అన్నారు. 20ఏళ్ల తర్వాత సభా మర్యాదలు నేర్చుకుంటానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలను పదేపదే చేస్తుందన్నారు. బీఆర్ఎస్ దేశానికి పోతుందని, రాబోయే కాలంలో పాలిస్తుండొచ్చు కానీ ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలన్నారు.

పదేపదే తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తుందనే విషయాన్ని మానుకోవాలని సూచించారు. దళితబంధును ఐఏఎస్, ఐపీఎస్‌లకు కూడా కేసీఆర్ ఇస్తాననన్నారని, 2లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారన్నారు. గతేడాది 17, 700 కోట్లు కేటాయించారని.. కానీ హుజూరాబాద్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నప్పటికీ ఇప్పటివరకు కొందరికి రెండో విడుత మంజూరుకాలేదన్నారు. ఎన్ని సంవత్సరాల్లో దళితబంధును పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో 3వేల కుటుంబాలకు దళితబందు రాలేదని వెల్లడించారు. వీఆర్ఏలకు పదివేలు పక్కరాష్ట్రంలో ఇచ్చినట్లు ఇవ్వాలని, మహిళలకు పావలా వడ్డీ రుణాలు మంజూరు చేయాలని, రిటైర్మెంట్ ఉద్యోగులకు జీపీఎప్ ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదని, ఈహెచ్ఎస్ ఉద్యోగులకు వైద్యం అందడం లేదని మండిపడ్డారు. గల్ఫ్ కార్మికులు బ్రోకర్ల బారినపడకుండి ప్రభుత్వమే చొరవ తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story