- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
చాకలి ఐలమ్మ ఉత్సవాలకు కమిటీ.. మంత్రి పొన్నం ప్రభాకర్
దిశ, తెలంగాణ బ్యూరో: చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. చైర్మన్ గా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, సభ్యులుగా మరో 40 మంది ఉన్నారన్నారు. శుక్రవారం ఆయన సెక్రటేరియట్ లో బీసీ వెల్ఫేర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. "పాలకుర్తి లో చాకలి ఐలమ్మ స్మారక భవనానికి స్థల పరిశీలన చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. రోడ్లు పనుల నిమిత్తంలో తొలగించిన చాకలి ఐలమ్మ విగ్రహం పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. గద్దె నిర్మాణం ఇతర ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు, వర్ధంతి కార్యక్రమం కోసం కోసం ప్రభుత్వం నుంచి రూ.15 లక్షలు విడుదల చేశామన్నారు. ఈ నెల 26 వ తేదిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడానికి ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేయాలి" అని పొన్నం అన్నారు.