- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏందయ్యా నీ లొల్లి.. న్యూసెన్స్ చేస్తున్నావ్.. మండలిలో ఎమ్మెల్సీపై చైర్మన్ గుస్స

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు (MLC Tata Madhu)పై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ (Legislative Council) శాసన మండలి సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్సీ కోదండరామ్ మాట్లాడుతుండగా రన్నింగ్ కామెంట్రీ చేయడంపై చైర్మన్ మండిపడ్డారు. ఏందయ్య నీ లొల్లి.. న్యూసెన్స్ చేస్తున్నావ్.. ప్రతీరోజు మీ రన్నింగ్ కామెంట్రీ ఏంటని తాత మధును ప్రశ్నించారు. ఏదైనా మాట్లాడాలనుకుంటే మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడాలని తాత మధుకు గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. ఈ వ్యవహారంపై మండలిలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) స్పందించారు. మండలి సభ్యులను ఉద్దేశించి సభలో గౌరవ చైర్మన్ న్యూసెన్స్ అనే పదం వాడడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. న్యూసెన్స్ అనే పదం కరెక్ట్ కాదని కవిత తప్పుబట్టారు. తాను మీకు చెప్పే అంతా పెద్దదాన్ని కాదు.. ఆ పదాన్ని దయచేసి రికార్డుల నుంచి తొలగించండని కోరారు.
శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. క్వింటాల్ పసుపునకు రూ. 15 వేల మద్దతు ధర చెల్లించాలని నిరసన తెలిపారు. కేంద్రం పసుపు బోర్డు ప్రకటించింది కానీ చట్టబద్ధత లేదని ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడారు. తక్షణమే పసుపు బోర్డుకు కేంద్రం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.