విద్యుత్ ​ఫిర్యాదుల కోసం 'సీజీఆర్​ఎఫ్'

by Sathputhe Rajesh |
విద్యుత్ ​ఫిర్యాదుల కోసం సీజీఆర్​ఎఫ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్​వినియోగదారుల సమస్యల ఫిర్యాదుల కోసం ప్రత్యేక పోర్టల్​ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎలక్ట్రిసిటీ రెగ్యులటరీ కమిషన్​చైర్మన్​శ్రీరంగరావు తెలిపారు. ఈఆర్సీ కార్యాలయంలో సోమవారం కన్స్యూమర్​గ్రీవెన్సెస్​రిడ్రస్సల్​ఫోరమ్(సీజీఆర్ఎఫ్)​అనే పోర్టల్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండానే ఆన్ లైన్​ద్వారానే ఫిర్యాదు చేయొచ్చని వెల్లడించారు. సమస్యలతో పాటు అధికారుల పనితీరుపై కూడా ఇందులో ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. కన్స్యూమర్స్ గ్రీవెన్స్ సెల్ ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు ఏ సమస్య వచ్చినా ఇందులో కంప్లైంట్​చేయొచ్చని, గ్రీవెన్స్ సెల్ సమస్యకు పరిష్కారం చూపించకుంటే అంబుడ్స్ మెన్ అథారిటికి ఫిర్యాదు చేయిచ్చని శ్రీరంగరావు సూచనలు చేశారు. ఈ పోర్టల్​ను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు

Advertisement

Next Story