CESS Elections: కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-26 07:37:36.0  )
CESS Elections: కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేముల వాడలోని లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సహకార విద్యుత్ సహకార సంఘం(సెస్) ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ వేముల వాడలో కొనసాగుతోంది. ఫలితాల్లో 12 చోట్ల బీఆర్ఎస్, రెండు చోట్ల బీజేపీ, ఒక చోట కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కాగా కౌంటింగ్ కేంద్రం దగ్గర బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పోటాపోటీ నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. బ్యాలెట్ బాక్సుల్లో కొంత మంది మున్సిపల్ వద్దు గ్రామపంచాయతీలు ముద్దు అని రాసి వేయడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story