Kishan Reddy : రేవ్ పార్టీపై సమగ్ర విచారణ జరగాలి.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Ramesh N |   ( Updated:2024-10-27 13:35:58.0  )
Kishan Reddy : రేవ్ పార్టీపై సమగ్ర విచారణ జరగాలి.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ KTR బంధువు రాజ్ పాకాల Janwada Farm House జన్వాడ‌ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగినట్లు సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో Kishan Reddy మీడియాతో మాట్లాడారు. Rave Party రేవ్ పార్టీ ఎట్లా ఉంటుందో తెలియదు కొకైన్ అంటే కూడా పేపర్ లో చదివి తెలుసుకున్నాని కిషన్ రెడ్డి అన్నారు. ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగిందో లేదో సమగ్రంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరి ఫామ్‌హౌస్ అయిన సీఎం బంధువు అయినా, మాజీ ముఖ్యమంత్రి బంధువు అయినా దర్యాప్తు జరపాలని, ఈ వ్యవహారంపై బీజేపీ స్టాండ్ ఇదేనని స్పష్టం చేశారు. మద్యం పర్మిషన్ లేకుండా లిక్కర్ సరఫరా చేశారని పోలీసులు చెప్పినట్లు స్క్రోలింగ్ వస్తుందని తెలిపారు. డ్రగ్స్‌పై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగాలని, చట్టం తన పని తాను చేసుకోవాలని కోరారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు

దీనిపై బీఆర్ఎస్ BRS నాయకులు మాట్లాడుతున్నారు.. ఒక పథకం ప్రకారం కావాలనే అక్రమ కేసులు పెడుతున్నారని మాట్లాడుతున్నారని చెప్పారు. గతంలో ఫామ్‌హౌస్ ఫైల్స్‌తో కేసీఆర్ మూడున్నర గంటలు అందరికీ సినిమా చూయించారని గుర్తుకు చేశారు. ఆ స్వామీజీ ఎవరో ఇంత వరకు మాకు తెలియదన్నారు. ఓ స్వామీజీ పోయారంట.. ముగ్గురు ఎమ్మెల్యేలను డబ్బులు ఇవ్వడానికి పోయారని, డబ్బులు దొరికాయని చెప్పారు.. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా డిపాజిట్ చేయలేదని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఆరోపణలపై మంత్రి మాట్లాడారు.

అదేవిధంగా రాష్ట్రంలో మొదటి శిఖండి కేటీఆర్ అని, Congress కాంగ్రెస్ పార్టీకి కూడా కేటీఆరే శిఖండని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకరిని మంచిన మహా ఘనులు అని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను KCR కేసీఆర్ నాశనం చేశారని, పది నెలల్లో కాంగ్రెస్ మరింత భ్రష్టుపట్టించిందన్నారు. కాంగ్రెస్ వస్తే రాష్ట్రం బాగుపడుతుందని నమ్మి ప్రజలు మోసం పోయారన్నారు. బీఆర్ఎస్, పది నెలల కాంగ్రెస్ పాలనకు తేడా ఏమీ లేదని, రాష్ట్రం నిరసనలతో అట్టుకుడుకుతోందన్నారు. అన్ని సామాజిక వర్గాల్లు అవస్థలు పడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు ఎవరికి అర్థం కానీ పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేదంటారు మూసీ ప్రాజెక్టు లక్షన్నర కోట్లు అంటారు? MUSI మూసీలో ఎన్ని భూములు అమ్ముతున్నారు? ఎలాంటి ప్రణాళిక ఉంది? లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. congress govt కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అప్పులెంత? గత ప్రభుత్వ స్కీమ్‌లు ఉన్నాయా? ఎత్తేశారా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story