- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశ వ్యాప్తంగా ఆ కల్చర్ పెరుగుతోంది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ(Narendra Modi) ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల రూపురేఖలు మారుతున్నాయని అన్నారు. భద్రాచలం, రామప్ప, జోగులాంబ, బల్కంపేట ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్‌లోని వేయి స్తంభాల ఆలయ మండపంలో పూజా కార్యక్రమాలు ప్రారంభించినట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా 150 దేవాలయాలకు పూర్వవైభవం తీసుకొస్తున్నట్లు తెలిపారు.
అందరిలోనూ అవగాహన పెరిగిందని.. ఇప్పుడు యువత కూడా పెద్ద ఎత్తున ఆలయాలకు వస్తున్నారని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరిగిందని చెప్పుకొచ్చారు. పెద్దలపై గౌరవం, దేశ భక్తి, సమాజంపై బాధ్యత పెంచుకోవాలని అన్నారు. మరింత అంకితభావం, చిత్తశుద్ధితో దేశాభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వరంగల్లోని భద్రకాళి ఆలయాన్ని కూడా అద్భుతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు..
సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారి విగ్రహా ధ్వంసానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంతమైన హైదరాబాద్ నగరంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.అందులో భాగంగానే.. సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వసం చేశారని ఫైరయ్యారు.