- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం విడిపోయినంత మాత్రాన డిలిమిటేషన్ చేయాలనేది సబబు కాదని అన్నారు. సోమవారం లోక్ సభలో మాట్లాడిన కిషన్ రెడ్డి దేశమంతటా డిలిమిటేషన్ జరిగినప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో జరగలేదని అన్నారు. అందువల్లే ఇప్పుడు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం విడిపోయినంత మాత్రాన డిలిమిటేషన్ చేయాలనేది సబబు కాదన్న ఆయన పునర్విభజన చట్టాల్లో పెట్టినంత మాత్రాన అవుతుందా అని ప్రశ్నించారు.
చట్టంలో చాలా పెట్టారని అన్నారు. జనాభా లెక్కల ఆధారంగా అసెంబ్లీ స్థానాల పెంపు ఉంటుందని స్పష్టం చేశారు. కాగా పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచాల్సి ఉంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ సీట్ల సంఖ్యను 153 కు ఏపీలో 175 నుంచి 225 కి పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తులు చేశారు. అయినప్పటికీ కేంద్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీట్ల పెంపుపై తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారింది.
ఇవి కూడా చదవండి: ప్రెస్ క్లబ్‌కా.. ఫామ్ హౌస్‌కా.. ఎక్కడికి రమ్మన్నా వస్తా: కేసీఆర్‌కి మంత్రి కిషన్ రెడ్డి సవాల్
'అసెంబ్లీలో కేసీఆర్, కేటీఆర్‌కు స్క్రిప్ట్ రాసిచ్చింది వాళ్లే'