- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒకరోజు ముందే.. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర సాయుధ బలగాలు
దిశ, సిటీబ్యూరో : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం, పోలీసు శాఖ సమష్టిగా ప్రణాళికలను సిద్దం చేస్తుంది. వీటిలో ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లను పోలింగ్‌కు 24 గంటల ముందే సాయుధ బలగాలు పూర్తిగా అదుపులోకి తీసుకునేందుకు వీలుగా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన ఈ ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ రావటంతో కేంద్ర సాయుధ బలగాలు సిటీకి రానున్నట్లు సమాచారం. ముఖ్యంగా హెదరాబాద్ జిల్లాలోని హైదరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో ఈ సమస్యాత్మక ప్రాంతాలున్నట్లు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎలక్షన్ వింగ్, పోలీసు శాఖ సమష్టిగా గుర్తించింది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వచ్చే కార్వాన్, బహదూర్‌పురా, యాకుత్‌పురా, చార్మినార్ చంద్రాయణగుట్ట, గోషామహల్, రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిల్లో ఈ సమస్యాత్మక ప్రాంతాలున్నట్లు సమాచారం.
ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 1800 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నట్టు గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు వీలుగా పోలింగ్ స్టేషన్ల లోపల, బయట ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, బంజారాహిల్స్‌లోని పోలింగ్ కమాండ్ కంట్రోల్‌తో పాటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే అప్రమత్తం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ స్టేషన్లను అదుపులోకి తీసుకున్న తర్వాత 13వ తేదీ పోలింగ్ ముగిసి, ఈవీఎంలను సీజ్ చేసి డీఆర్సీ సెంటర్లకు తరలించే వరకు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు సమాచారం. దీనికి తోడు ఈ స్థానం నుంచి బరిలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థుల వెంట షాడో టీమ్‌లు నిఘా పెట్టేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
స్పెషల్ రూట్ మ్యాప్‌లు..
పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించటంలో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ సిటీకి కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన వ్యయ, సాధారణ పరిశీలకులు చేరుకున్నారు. పోలింగ్ రోజున వీరు సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు వీలుగా పరిశీలకులు పోలింగ్ స్టేషన్లను చేరుకునేందుకు వీలుగా స్పెషల్ రూట్ మ్యాప్‌లను రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ జారీ అయిన గత నెల 16వ తేదీ తర్వాత కూడా ఈ ప్రాంతాల్లో నిఘా విభాగాలు అధ్యయనం చేసినట్లు సమాచారం.