- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాసేపట్లో MLC Kavitha ఇంటికి సీబీఐ బృందం..
దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారంలో నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితన సీబీఐ విచారించనుంది. ఈ నేపథ్యంలో సీఆర్‌పీసీ కింద డిసెంబర్ 2న ఇప్పటికే సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై నమోదైన కేసు విచారణలో భాగంగా.. మద్యం పాలసీకి సంబంధించి కవిత దగ్గర ఏదైనా సమాచారం ఉందా అనే కోణంలో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించనున్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటికి కాసేపట్లో సీబీఐ వెళ్లనుంది. ఉదయం 11 గంటలకు హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని కవిత ఇంటికి సీబీఐ బృందం వెళ్లి, కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. సీబీఐ అధికారులకు కవిత పూర్తిగా సహకరిస్తానని తెలిపింది.
విచారణ నేపథ్యంలో ఆమె ఇంటికి రెండు వైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా, నాయకులు, కార్యకర్తలు రావొద్దని కవిత ఆదేశాలను జారీ చేసింది. ఆమె నివాసం వైపు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో కవిత ఇళ్లు పరిసరాలు నిర్మానుష్యంగా మారిపోయాయి.
Also Read.....