కవిత పిటిషన్ పై కౌంటర్ కు గడువు కోరిన సీబీఐ

by Prasad Jukanti |
కవిత పిటిషన్ పై కౌంటర్ కు గడువు కోరిన సీబీఐ
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ విచారణకు అనుమతిని వ్యతిరేకిస్తూ బీఆర్ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన కోర్టు కౌంటర్ దాఖలు చేసేందుకు ఈ నెల 10వ తేదీ వరకు సమయం ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 10న చేపట్టనున్నట్లు తెలిపింది. మరో వైపు ఏ నిబంధన ప్రకారం కవిత పిటిషన్ దాఖలు చేశారో చెప్పాలని కవిత తరపు లాయర్ ను సీబీఐ కోరింది. దీంతో కోర్టు సంతృప్తి చెందేలా సమాధానం ఇవ్వాలని కవిత లాయర్ ను న్యాయమూర్తి ఆదేశించారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి శుక్రవారం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story