Caste Survey: విద్యార్థులతో కుల గణన సర్వే.. ఇంటి యజమాని నిలదీత..వీడియో వైరల్

by Prasad Jukanti |
Caste Survey: విద్యార్థులతో కుల గణన సర్వే.. ఇంటి యజమాని నిలదీత..వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కులగణన సర్వే (Caste Survey) కొనసాగతున్నది. ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన ఇళ్లలో ప్రజల వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సర్వేను విద్యార్థులు, ప్రైవేట్ వ్యక్తుల (Survey by private persons) చేత చేయిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు సర్వే నిమిత్తం ఓ విద్యార్థు రాగా ప్రైవేట్ వ్యక్తులు ఎలా సర్వేచేస్తారంటూ ఓ ఇంటి యజమాని ప్రశ్నించారు.ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియనప్పటికీ ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉద్యోగులే ఈ సర్వే చేస్తుందని ప్రభుత్వం చెబుతుంటే ప్రైవేట్ వ్యక్తులను సర్వేకు పంపి వ్యక్తుల వ్యక్తిగత వివరాలు అడగడం ఏంటని నిలదీస్తున్నారు. కులగణన చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత వివరాలు అడుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో విద్యార్థులు సర్వేకు వచ్చిన ఘటన ఇప్పుడు వైరల్ అవుతున్నది. కాగా ఈ సర్వే నిమిత్తం 80 వేల మంది సిబ్బంధిని ఎన్యూమరేటర్లుగా ప్రభుత్వం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed