Bike riders : క్రాకర్స్ తో స్టంట్లు చేసిన బైక్ రైడర్లపై కేసులు

by Y. Venkata Narasimha Reddy |
Bike riders : క్రాకర్స్ తో స్టంట్లు చేసిన బైక్ రైడర్లపై కేసులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఐటీ కారిడార్(IT Corridor) లో దీపావళి(Diwali) పండుగ రోజున క్రాకర్స్(with crackers) తో బెక్ లపై స్టంట్లు(stunts) చేసి రెచ్చిపోయిన బైక్ రైడర్స్(bike riders) ఘటనపై పోలీస్ శాఖ స్పందించింది. రాయదుర్గం పోలీసులు(Rayadurgam Police) పదిమంది బైక్ రైడర్‌లపై కేసు(Cases)లు నమోదు చేశారు. వారి వద్ద నుండి పది బైకులను స్వాధీనం చేసుకున్నారు. హైటెక్ సిటీ టీ హబ్, మైహోమ్ భుజ ప్రాంతాలలో దీపావళి రోజు క్రాకర్స్ ను బైక్ పై పెట్టుకుని వెలిగించి రహదారి మీద రన్నింగ్ బైక్ పై యువకులు స్టంట్లు చేశారు. ఈ ఘటనపై సీనియర్ ఐపీఎస్, ఆర్టీసీ ఎండీ వీ.సీ.సజ్జనార్ తీవ్రంగా స్పందిస్తూ దీపావళి పండుగ పూట ఇదేం వికృతానందం.. ఎటు వెళ్తోందీ సమాజమంటూ యువతరం వెర్రిచేష్టలపై ఎక్స్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. తన పోస్టుకు బైక్ స్టంట్ల వీడియోను కూడా జత చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన రాయదుర్గం పోలీసులు విచారణ చేపట్టి పదిమంది బైక్ రైడర్‌లపై కేసులు నమోదు చేశారు. గత రెండున్నర నెలల్లో 250 మందిపై కేసులు పెట్టిన యువత బైక్ స్టంట్ల వైఖరి విడనాడటం లేదని, ఐటీ క్యాడర్లలో స్టంట్‌లు బైక్ రైసింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed