ఔటర్‌పై ప్రమాదాలు.. సైకిల్ ట్రాక్‌పైకి దూసుకొచ్చిన ఇన్నోవా కారు

by Ramesh N |
ఔటర్‌పై ప్రమాదాలు.. సైకిల్ ట్రాక్‌పైకి దూసుకొచ్చిన ఇన్నోవా కారు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నిన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం మరువకముందే తాజాగా మరో ఓవర్ స్పీడ్ ప్రమాదాలు రెండు సంభవించాయి. ఓఆర్ఆర్‌పై ఉన్న సోలార్‌ రూఫ్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్‌‌పై ఒక ప్రమాదం జరిగింది. గతంలో ఓ ట్రక్, కారు భారీ వేగంతో దూసుకు వచ్చి సైక్లింగ్ ట్రాక్‌లోని ఓ సెక్షన్‌ను ఢి కొట్టాయి. ప్రమాదాల్లో సోలార్ ట్రాక్ నిర్మాణం కాస్త దెబ్బతింది. తాజాగా సోలార్ సైకిల్ ట్రాక్ పై నుంచి ట్రాక్ డివైడర్ వైపు ఇన్నోవా కారు దూసుకెళ్లింది. ఇవాళ తెల్లవారు జామున ఈ ఘటన జరిగిన ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఓవర్ స్పీడ్‌తో ట్రాక్‌పైకి కారు దూసుకువచ్చిందని పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు.

నార్సింగ్ లో మరో రోడ్డు ప్రమాదం..

ఓఆర్ఆర్ సమీపంలోనే గోల్కొండ తారామతి వద్ద ఓ కీయ కారు డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. అతివేగంగా వచ్చి రోడ్డు పక్కనే ఉన్న ఫుట్ పాత్ పైకి కియా కారు దూసుకెళ్లింది. పల్టీలు కొట్టడంతో కారులో ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందిన వేంటనే స్పాట్‌కి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story