- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీలో గెలవలేము అందుకే ఆ పార్టీలోకి! పొంగులేటిపై మాజీ అనుచరుడు సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఆయన మాజీ అనుచరుడు మట్ట దయానంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరంభంలో టెన్షన్‌తో సీఎం కేసీఆర్‌పై పొంగులేటి సవాల్ చేశాడని కానీ ఇప్పుడు భయపడుతున్నాడని అన్నారు. పొంగులేటిని కాదని ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్న దయానంద్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తొలుత బీజేపీకి వెళ్దాం అనుకున్నారు. కానీ బీజేపీ అయితే ఖమ్మంలో 10 కాదు కదా ఒక్క సీటు కూడా గెలవలేమని తాను చెప్పానని అన్నారు. పదేళ్లకు పైగా పొంగులేటికి అనుచరుడిగా ఉన్నానని అయినా నా మాటలు ఆయనకు నచ్చలేదే ఏమో కానీ తనను దూరం పెట్టారని అన్నారు.
బీజేపీలో చేరితే గెలవలేనననే తాను కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. కాగా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత పొంగులేటి శ్రీనివాస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ఆయన ఏ పార్టీలో చేరుతారు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మొదట ఆయన బీజేపీలో చేరుతారని ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరుతారనే టాక్ వినిపించింది. ఈ గ్యాప్‌లో మరికొంత మంది ఉద్యమ కారులతో కలిసి కొత్త పార్టీ ప్రారంభించబోతున్నారనే ఉహాగానాలు సైతం వినిపించాయి. ఈ క్రమంలో పొంగులేటి నిర్ణయం ఆలస్యం కావడంతో ఇన్నాళ్లు ఆయనకు అనుచరులుగా ఉన్న వారు క్రమంగా ఆయకు దూరం కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది.
టెన్షన్లో కేసీఆర్ మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ చేశాడు కానీ ఇప్పుడు భయపడుతున్నాడు
— Telugu Scribe (@TeluguScribe) May 28, 2023
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్దాం అనుకున్నారు. బీజేపీ అయితే ఖమ్మం 10 కాదు ఒక్క సీట్ కూడా గెలవలేము అని చెప్పాను. పదేళ్లకు పైగా పొంగులేటి అనుచరుడిగా ఉన్నాను. అయినా నా… pic.twitter.com/Z3e2yoUhWj