- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పొంగులేటి బంధువనే వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేస్తలేరా: రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: మెదక్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం రణరంగాన్ని తలపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటూ పోటీని రసవత్తరంగా మారుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ రఘునందన్ రావు వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు రాధాకిషన్ రావు ఇచ్చిన ఆధారాలతో మెదర్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన విపరీతంగా డబ్బులు పంచినట్లుగా విచారణలో రాధాకిషన్ వెల్లడించినట్లుగా రఘునందన్ తెలిపారు.
ఇప్పటి వరకు విచారణలో దొంగలు ఎవరో బయటపడిందని, పొగులేటి బంధువనే కారణం చేత వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయట్లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయంలో మళ్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనన్న విషయం తేటతెల్లమైందని అన్నారు. బీజేపీ అభ్యర్థుల ఓటమి కోసం ఆ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. పారిశ్రామికవేత్త శరత్‌చంద్రారెడ్డిని బెదిరించి రూ.14 కోట్లు వసూలు చేసిన ఎమ్మెల్సీ కవితపై సుమోటోగా కేసు నమోదు చేయాలని రఘునందన్ రావు ఆరోపించారు.