'నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను కమ్యూనిస్టు అనడం కాదు'

by Rajesh |
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను కమ్యూనిస్టు అనడం కాదు
X

దిశ, మక్తల్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశ స్వతంత్రం కోసం పోరాటాన్ని ఎన్నుకున్నందున ఆయన్ను కమ్యూనిస్టు నాయకుడు అనడం సరి కాదని శిశుమందిర్ ప్రధానాచారి కురుమయ్య అన్నారు. మక్తల్ పట్టణంలో స్వామి వివేకానంద సుభాష్ చంద్రబోస్ 126 జయంతి వేడుకలు పరాక్రమ దివస్ ను ఏబీవీపీ కార్యకర్తలు నిర్వహించారు. మక్తల్ ప్రభుత్వ బాలుర స్కూల్ కాంప్లెక్స్ అధికారి అనిల్ గౌడ్ జయంతి వేడుకలు నిర్వహించారు.

అంతకుముందు దాదాపు 500 మంది కాలేజీ విద్యార్థులతో మువ్వన్నెల జెండాలను చేతబట్టి పుర పట్టణ వీధుల గుండా ఊరేగింపు నిర్వహించి వారి చిత్ర పటానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం సిద్ధించడానికి దేశ ప్రజలు ఏకం కావడమే లక్ష్యంగా జాతీయ భావంతో ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించారన్నారు. భారత్ మాతాకీ జై, జై హింద్ అనే పదాలు సుభాష్ చంద్రబోస్ నోటి నుండి వచ్చిన నినాదాలు అన్నారు.

ఎర్రజెండాల నాయకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ తమ వాడని అనడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. పరాయి పాలకుల చేతి నుండి దేశానికి విముక్తి కల్పించడానికి యువతలో ఉత్తేజాన్ని నింపడానికి గాను 'నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను' అంటూ స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడని కొనియాడారు. అహింసా మార్గం సరికాదని పోరాటం ద్వారానే స్వాతంత్రం సిద్ధిస్తుందని పిలుపునిచ్చిన గొప్పయోధుడు సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ అధ్యక్షులు అంజిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రవణ్, నగర ఉపాధ్యక్షుడు వినయ్, సురేష్, నితిన్, నర్సింహా, అనిల్, రాజు నిఖిల్, నరేష్, జగదీష్, కళాశాల విద్యార్థులు పట్టణ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed