CAG Report : ముగిసిన ఏడాదికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ సంచలన నివేదిక

by Rajesh |   ( Updated:2024-08-02 07:57:32.0  )
CAG Report : ముగిసిన ఏడాదికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ సంచలన నివేదిక
X

దిశ, వెబ్‌డెస్క్: 2023 మార్చితో ముగిసిన ఏడాదికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్) సంచలన నివేదిక అందజేసింది. రాష్ట్ర జీఎస్‌డీపీ 2021-22తో పోలిస్తే 2022-23లో 16 శాతం పెరిగింది. రెవెన్యూ రాబడులు గణనీయంగా 25 శాతం మేర పెరిగాయని తెలిపింది. రెవెన్యూ రాబడుల వృద్ధి రేటు ఒక శాతం తగ్గింది. సొంత పన్నుల రాబడి గణనీయంగా 17 శాతం పెరిగింది. సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.2,06,977 కోట్లకు పెరిగిందని వెల్లడించింది. 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సిన 20 ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరిగిందని తెలిపింది.

రూ.2,749 కోట్ల మేర ద్రవ్యలోటు తక్కువ చేసి చూపించారని వెల్లడించింది. 2022-23లో ప్రభుత్వం ఇచ్చిన రుణాలు, అడ్వాన్స్‌లు 150 శాతం మేర పెరిగినట్లు పేర్కొంది. సొంత రాబడి లేని సంస్థలకు ప్రభుత్వం రుణాలు ఏర్పాటు చేసిందని స్పష్టం చేసింది. 2022-23లో బడ్జెట్ వెలుపలి రుణాలు రూ.1,18,629 కోట్లుగా అంచనా వేసింది. ఆయా రుణాలకు ప్రభుత్వం తదుపరి రుణాలుగా రూ.17,829 కోట్లు అందించిందని వెల్లడించింది. రాష్ట్రాభివృద్ధి రుణాలు, వడ్డీపై ఖర్చు తక్కువగా అంచనా వేస్తున్నారని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed