- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై కేబినెట్‌లో నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఇప్పటికే నిఖత్ జరీన్‌కు, మహ్మద్ సిరాజ్‌కు గ్రూపు-1 ఉద్యోగం, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేగాకుండా.. కొత్త రేషన్ కార్డులు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లు, జీహెచ్‌ఎంసీలో విలీనం కానున్న ఔటర్ లోపలి మున్సిపాలిటీలు, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు, జాబ్ క్యాలెండర్, హెచ్‌ఎండీఏ పరిధి విస్తరణ, రైతు భరోసారి విధివిధానాలు వంటి తదితర అంశాల ఆమోదంపై సుదీర్ఘంగా చర్చించారు. చర్చల అనంతరం కొత్త రేషన్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకున్నారు.
కొత్త రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నది. ఈ కమిటీ రేషన్ కార్డుల జారీకి విధివిధానాలు రూపొందించనున్నది. మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు విడి విడిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.