Errabelli Dayakar Rao : ఉప ఎన్నికలు ఖాయం

by M.Rajitha |
Errabelli Dayakar Rao : ఉప ఎన్నికలు ఖాయం
X

దిశ, వెబ్ డెస్క్ : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురవ్వడం తప్పదని అన్నారు. ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయం అన్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్పక విజయం సాధిస్తుందని ఎర్రబెల్లి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీ-ఫామ్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేషం ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుల మీద వేటు వేయాలని పలువురు బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్ట్ నాలుగు వారాల్లో పార్టీ మారిన వారిపై వేటు వేయాలని, లేదంటే తామే సుమోటోగా తీసుకోవాల్సి వస్తుందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ తీర్పుపై స్పందించిన కడియం శ్రీహరి.. హైకోర్ట్ తీర్పును గౌరవిస్తున్నామని, అదే సమయంలో తీర్పును పూర్తిగా సమీక్షించి సుప్రీం కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed