పచ్చని పల్లెలో ఉప ఎన్నిక చిచ్చు.. తాగుడు కోసం కొట్టుకున్న నేతలు!

by GSrikanth |
పచ్చని పల్లెలో ఉప ఎన్నిక చిచ్చు.. తాగుడు కోసం కొట్టుకున్న నేతలు!
X

దిశ, నల్లగొండ బ్యూరో: మునుగోడు ఉపఎన్నిక పచ్చని పల్లెల్లో రాజకీయ చిచ్చును రేపింది. సరిగ్గా ఏడాది కాలం లేని శాసనసభకు వెళ్లేందుకు రాజకీయ పార్టీలు వేస్తోన్న ఎత్తులకు పైఎత్తుల్లో సాధారణ జనం నలిగిపోతున్నారు. చేస్తున్న పనిని మానేసినోళ్లు.. పొలం పనులకు పోకుండా నేతలు పోసే మద్యానికి బానిసైనోళ్లు.. ఇలా ఒక్కరేంటీ.. అర్థాంతరంగా వచ్చిన ఉపఎన్నిక మునుగోడు నియోజకవర్గ ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేసిందనే చెప్పాలి. ఇదిలావుంటే.. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఈ ఉపఎన్నికలో గెలవడం ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. తాజాగా నియోజకవర్గంలోని అంతంపేటలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్‌లో ఓటర్లను ఆకర్షించేందుకు మందు విందు ఏర్పాట్లు చేసింది. అయితే అక్కడా కొంతమంది ఓటర్లకు మద్యం బాటిళ్లు అందకపోవడం.. అడిగితే నేతలు స్పందించకపోవడంతో రచ్చ రచ్చ అయ్యింది. మాకు మద్యం బాటిళ్లు ఎందుకివ్వరంటూ ఓటర్లు తిరగబడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలై.. ఒకరిపై మరొకరు దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed