గవర్నర్ ఆమోదం తెలపగానే అధ్యాపక ఖాళీల భర్తీ.. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి

by Javid Pasha |
గవర్నర్ ఆమోదం తెలపగానే అధ్యాపక ఖాళీల భర్తీ.. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి
X

దిశ, తెలంగాణ బ్యూరో: యూనివర్శిటీల కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లును గవర్నర్ ఆమోదం తెలపగానే ఖాళీగా ఉన్న1062 అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీలో ఉస్మానియా యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) ఆధ్వర్యంలో నిర్వహించిన 11 విశ్వవిద్యాలయాల అధ్యాపక సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రధాన సమస్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రకటించిన పోస్టులతో పాటు అదనంగా మరో వెయ్యి అధ్యాపక పోస్టులను మంజూరు చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నదన్నారు. వివిధ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఔటా వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ జీ మల్లేశం, నాయకులు సరస్వతమ్మ, రాధాకృష్ణ, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story