- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పల్లెల్లో మొదలైన పండగ వాతావరణం.. కిక్కిరిసిన బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు
దిశ, వెబ్డెస్క్: నేటితో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పటివరకు రాజకీయ నాయకుల్లో కనిపించిన ఎన్నికల హడావిడి తగ్గిపోయింది. కాగా ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త సందడి ఏర్పడింది. జనాలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంతూళ్లకు బయల్దేరారు. దీంతో వేలాది మంది జనం తరలివెళ్తుండటంతో బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనాలతో రద్దీగా మారిపోయాయి. చాలా మంది రిజర్వేషన్ దొరక్కపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మరికొంతమంది తమ సొంత వాహనాలతో బయల్దేరుతున్నారు. ఇదే అదునుగా భావించిన కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ పెద్ద ఎత్తున టికెట్స్ ధరలను కూడా పెంచేశాయి. దీంతో అధికారులు ఈ సమస్యను గమనించి చర్యలు తీసుకోవాలని, ఎన్నికల కోసం బస్సులు మరిన్ని పెంచాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, ఎన్నికల వేళ నగరంలో స్థిరపడ్డ వారంతా ఊర్లకు తరలివెళ్తుండటంతో గ్రామాల్లో ఒక్కసారిగా పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది.