ఆక్సిడెంట్ పేరుతో పండ్ల వ్యాపారులకు బురిడీ.. 15లక్షల ఆపిల్స్ లోడ్ మాయం

by Y. Venkata Narasimha Reddy |
ఆక్సిడెంట్ పేరుతో పండ్ల వ్యాపారులకు బురిడీ.. 15లక్షల ఆపిల్స్ లోడ్ మాయం
X

దిశ, వెబ్ డెస్క్ : ఆపిల్ పండ్ల లోడ్ తో వెలుతున్న కంటెయినర్ బోల్తా పడిందని..జనం పండ్లను ఎత్తుకెళ్ళారంటూ కట్టు కథలు చెప్పి డ్రైవర్లు పండ్ల వ్యాపారులను మోసం చేసిన వైనం వెలుగు చూసింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌ కొత్తపేట పండ్ల మార్కెట్‌ పండ్ల వ్యాపారి కందగొండ దత్తాత్రేయ ఈ నెల 17న సిమ్లాలో భువన్‌సింగ్‌ అనే వ్యక్తి వద్ద వీటి విలువ రూ.15.32 లక్షలు విలువ చేసే 493 డబ్బాల యాపిల్ పండ్లను కొనుగోలు చేశాడు. వీటిని చెన్నైలో విక్రయించేందుకు కంటైయినర్‌ ట్రక్కు తీసుకున్నారు. రవాణా చేసేందుకు ట్రాన్సుపోర్టు కంపెనీకి రూ.1,32,200 దత్తాత్రేయ చెల్లించాడు. కంటైనర్‌లో పండ్లను తీసుకొని బయలుదేరిన డ్రైవర్లు, ఈ నెల 23వ తేదీన చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురానికి చేరుకున్నారు.

అక్కడిదాక కంటెయినర్ తో చేరుకున్న ఇద్దరు డ్రైవర్లు హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై దండుమల్కాపురం వద్ద జరిగిన ప్రమాదంలో కంటెయినర్ లారీ బోల్తా పడటంతో యాపిల్‌ పండ్లను జనం ఎత్తుకెళ్లారని భువన్‌సింగ్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. పండ్ల వ్యాపారితో పాటు భువన్‌సింగ్‌ వచ్చి చూడగా, కంటైనర్‌ ట్రక్కుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అక్కడ ఇద్దరు డ్రైవర్లు కూడా కనిపించకుండా పారిపోయారు. వారికి ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన బాధిత వ్యాపారులు ఆపిల్ లోడ్ ను డ్రైవర్లు ఇద్దరు కలిసి మాయం చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed