Sexual life : బెడ్‌పై నేనున్నా ఆ వస్తువులు చూస్తేనే మా ఆయనకు ఉద్రేకం

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-09-30 15:50:24.0  )
Sexual life : బెడ్‌పై నేనున్నా ఆ వస్తువులు చూస్తేనే మా ఆయనకు ఉద్రేకం
X

డాక్టరు గారూ, నాకు ఈ మధ్యనే వివాహం అయింది. మా వారికి ఉన్న వింత అలవాటు నాలో ఆయన పట్ల విముఖతను కలిగిస్తోంది. ఆయన సూట్‌కేసులో రకరకాల పెన్నులున్నాయి. అవన్నీ ఆయన స్కూల్ రోజుల నుంచి ఆయన పీజీ అయ్యేంత వరకు తన మహిళా సహోధ్యాయులను అడిగి, లేదా దొంగతనం చేసి సంపాదించుకున్నవట. సమస్య ఏంటంటే శృంగార సమయంలో ఆ సూట్‌కేసును తెరిచి వాటిని చూస్తూ, తాకుతూ ఉద్రేకం పొందుతారు. అవి లేకపోతే (చాలాసార్లు విసిరేశాను) ఆయనకు నా మీద ఎక్కువ ఉద్రేకం కలగదు. ఈ పరిస్థితి నాకు చాలా అసహ్యంగా ఉంది. దయచేసి ఏం చేయాలో చెప్పగలరు. - సునీత.

సునీతగారూ మీ సమస్య ఇబ్బందికరంగానే ఉంది. మీ వారి మనో లైంగిక సమస్యను సైకో సెక్సువల్ డిజార్డర్, ఫెటిషిజం అంటారు. స్త్రీల వస్తువులపై లైంగికాపేక్షను పెంచుకుని వీరు లైంగికోద్రేకాన్ని పొందుతారు. వీరినే ఫెటిష్లని కూడా అంటారు. అయితే వస్తువు లేకుండా మీపై శృంగారాసక్తి కలగడం లేదంటే ఆయన లైంగికోద్రేకం జనింపచేసుకోవడానికి మానసికంగా ఎక్కువగా ఆ వస్తువుపైనే ఆధారపడి పోయారు. ఇది సహజలైంగిక చర్య కాదు తనతో పాటు మీలో కూడా ఆందోళన పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ వారితో వెంటనే సెక్సాలజిస్టు వద్దకు వెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించండి. వస్తువు లేకుండా మెల్లగా మీపైనే సహజమైన శృంగారాసక్తిని కలిగించే కౌన్సిలింగ్ (అంటే - మనోలైంగిక వ్యాయమాలు, ఇతర సెక్సు థెరపీ) చేస్తారు. తద్వారా తనలో సహజ శృంగారానుభవ ఉద్రేకాన్ని పొందవచ్చునే లైంగిక అవగాహన కలిగించి మీ సమస్యను పరిష్కరిస్తారు.

- డాక్టర్ భారతి. MS

సైకోథెరపిస్ట్ &సెక్సాలజిస్ట్

👉 మరిన్ని సెక్స్ & సైన్స్ వార్తల కోసం సందర్శించండి

Advertisement

Next Story