పాలిటిక్స్‌లోకి బన్నీ.. బీఆర్ఎస్ తరపున బరిలోకి..

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-08 11:16:58.0  )
పాలిటిక్స్‌లోకి బన్నీ.. బీఆర్ఎస్ తరపున బరిలోకి..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ‘పుష్ప’ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవల్‌లో బన్నీ తన సత్తా చాటారు. గతంలో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ‘ప్రజారాజ్యం’ పార్టీకి బన్నీ మద్దతు తెలిపారు. బన్నీ భార్య స్నేహా రెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్‌గా ఉన్నారు. మామ కోసం అల్లు అర్జున్ ప్రచారంలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు.

కంచర్ల చంద్రేశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడిగా పాలిటిక్స్‌లో ఉన్నారు. నల్లగొండ జిల్లాలోని పెద్దవూర మండలం చింతపల్లి చంద్రశేఖర్ రెడ్డి స్వస్థలం. 2014లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఆయన ఓడి పోయారు. ఆనాడు బన్నీ మామకు మద్ధతుగా ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.

నాగార్జున సాగర్ నుంచి ఈ సారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కంచర్ల ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలను పెంచారు. ఈ నెల 19 నుంచి నియోజకవర్గంలో యాక్టివిటీస్ పెంచాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా పెద్దవూర సమీపంలోని ముసలమ్మ చెట్టు వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన ఆఫీస్, ఫంక్షన్ హాల్ ప్రారంభించేందుకు అల్లు అర్జున్ వస్తున్నారు. అక్కడే 10వేల మందితో సభ ఏర్పాటు చేయాలని చంద్రశేఖర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి బన్నీ మామకు కేసీఆర్ ఈ సారి టికెట్ ఇస్తారా.. ఇస్తే బన్నీ ప్రచారంలో దిగితే రిజల్ట్ ఎలా ఉంటుందనేది పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికరంగా మారింది.

Read More..

‘పుష్ప 2: ది రూల్’ నుంచి ఫాహద్ ఫాజిల్ నయా లుక్ రిలీజ్

Advertisement

Next Story