- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రోజులకు కాంగ్రెస్ తిరిగి తీసుకొచ్చింది.. BRS ఆసక్తికర ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో పాము కాటుకు రైతు బలైన విషయం తెలిసిందే. మద్దిరాల మండలం చిననెమిలకు చెందిన రావుల లింగయ్య (56) తనకున్న రెండెకరాల్లో వరి వేశాడు. రాత్రి 11.30 గంటలకు పొలానికి వెళ్లిన లింగయ్య పాముకు కాటుకు గురై అక్కడికక్కడే చనిపోయాడు. ఆయన మరణానికి అర్ధరాత్రి కరెంటు ఇవ్వడమే కారణమని, లింగయ్య మృతికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా.. దీనిపై సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ ఆసక్తికర ట్వీట్ పెట్టింది. ‘అర్ధరాత్రి రైతులు పొలాల దగ్గర పడుకునే పరిస్థిని. విద్యుత్ షాక్‌తో, పాటు కాటులతో రైతులు చనిపోయే రోజులు మళ్లీ వచ్చాయి. ఇందిరమ్మ రాజ్యం - రైతుల పాలిట శాపం’ అని ఎక్స్(ట్విట్టర్) వేదికగా ట్వీట్ పెట్టింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. బీఆర్ఎస్ ఎనాడూ రైతులను, నిరుద్యోగులను, విద్యార్థులను పట్టించుకున్న పాపాన పోలేదని కొందరు.. మళ్లీ కేసీఆరే రావాలని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
కాంగ్రెస్ వచ్చింది.. రైతన్నలకు కష్టాలు తెచ్చిందినల్గొండ జిల్లా మద్దిరాల మండలం చిన్ననేమిల గ్రామానికి చెందిన రావుల లింగయ్య అనే రైతు రాత్రి పూట కరెంటు కోసం పొలం దగ్గరకు వెళ్లి పాముకాటుతో మృతి. pic.twitter.com/pQh7QzagKt— BRS Party (@BRSparty) March 9, 2024