- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇస్తాంబుల్, డల్లాస్, ప్యారిస్ పూర్తైనయి.. ఇప్పుడు టోక్యోనా?: కేటీఆర్ పై ఆర్ఎస్ ప్రవీణ్ సైటైర్లు
దిశ, వెబ్ డెస్క్: ఇస్తాంబుల్, డల్లాస్, ప్యారిస్ పూర్తైనయి.. ఇప్పుడు టోక్యోనా అని కేటీఆర్ పై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ సైటైర్లు వేశారు. హైదరాబాద్ ను మరో టోక్యోను చేస్తామంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘తెలంగాణలో ఇస్తాంబుల్, డల్లాస్, పారిస్ ల భ్రమలు అయిపోయినై, ఇప్పుడు మళ్లీ టోక్యో కూడానా?ఎన్ని రోజులని ఇట్ల మోసగిస్తనే ఉంటరు తెలంగాణ ప్రజల్ని’’ అంటూ ట్వీట్ చేశారు.
‘‘టోక్యోలో పరిపాలనలో ఎప్పుడైనా రహస్య జీవోలను చూసిండ్రా? చెరువుల్లో వేల కోట్ల కమీషన్లు తిని అక్రమ లేఅవుట్లు వేస్తరా? పాలకులు బినామీ కంపెనీలతో దోపిడీ సొమ్మును తెల్ల ధనంగా మార్చుకుంటరా? నకిలీ గ్రామ సభలను పెట్టి ప్రాజెక్టుల పేరుతో పేద రైతుల భూములను గుంజుకుంటరా? ముఖ్యమంత్రి తనయుడు 9 సంవత్సరాలు ఒకటే శాఖ(మునిసిపల్, పరిశ్రమలు, ఐటీ)కు మంత్రిగా ఉంటరా?’’ అని ప్రశ్నించారు.
తెలంగాణలో ఇస్తాంబుల్, డల్లాస్, పారిస్ ల భ్రమలు అయిపోయినై, ఇప్పుడు మళ్లీ టోక్యో కూడానా?
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) June 10, 2023
ఎన్ని రోజులని ఇట్ల రోజులు మోసగిస్తనే ఉంటరు తెలంగాణ ప్రజల్ని, @KTRBRS గారు?
టోక్యోలో పరిపాలనలో ఎప్పుడైనా రహస్య జీవోలను చూసిండ్రా?
చెరువుల్లో వేల కోట్ల కమీషన్లు తిని అక్రమ లేఅవుట్లు వేస్తరా?… pic.twitter.com/6Sm9Dzbfnk