మిషన్ భగీరథ నీళ్లు ఏమైనయ్ కేసీఆర్?: బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

by Javid Pasha |
RS Praveen Kumar
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. అక్కడి ప్రజల తాగునీటి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని బెజ్జూరు మండలంలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. మిషన్ భగీరథ నీళ్లు ఏమయ్యాయి కేసీఆర్ అంటూ ఆయన ప్రశ్నించారు. రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించి మిషన్ భగీరథ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా మారిందని అన్నారు. ఇప్పటికైనా అక్కడి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story