అనాథలా మణిపూర్.. బీఎస్పీ స్టేట్ చీఫ్ R. S. Praveen Kumar

by Javid Pasha |   ( Updated:2023-07-20 11:12:42.0  )
RS Praveen Kumar
X

దిశ, డైనమిక్ బ్యూరో: మణిపూర్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా ఎవరికీ తెలియదని, ఒక అనాథలా ఉందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దేశంలోనే ఉన్న ఒక ప్రాంతంలో అరాచక పాలన నడుస్తుంటే ఏ పార్టీ నాయకుడు కూడా మాట్లడుతలేడని అభిప్రాయం వ్యక్తం చేశారు. నేడు మణిపూర్ ఘటనకు సంబంధించి ఓ సోషల్ మీడియా పోస్టు చూస్తే ఒక్కసారిగా గుండెల్లో జలధరం వచ్చిందన్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని విమర్శించారు. అందుకే బెహన్ జీ బీఎస్పీ అగ్రనేత మాయావతి ఏ కూటమికి సపోర్ట్ చేయడం లేదన్నారు. అధికారం కోసం ఏకమవుతున్నారే తప్ప కానీ ప్రజల బాధల కోసం కాదన్నారు. మణిపూర్ ఘటనపై కేంద్ర హోంమంత్రి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మరో ట్వీట్ చేస్తూ.. పారిశుద్ధ్య కార్మికులు సమ్మె వీడి, విధుల్లో చేరితే వారి డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆర్థిక మంత్రి హరీష్ రావు హామీ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా పోలీసు నిఘాతో క్షణాల్లో తెలుసుకునే సీఎం కేసీఆర్‌కు 50 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై నిరవధిక సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రికి తెలియదంటే చాలా హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. బహుశా ఈ కార్మికుల కష్టాలు మీ పత్రిక, టీవీలో పతాక శీర్షికల్లో రాలేదు కావొచ్చని సెటైర్లు వేశారు.

Advertisement

Next Story

Most Viewed