గ్రామాల్లోని రోడ్లపై నడవాలంటే జిమ్నాస్ట్ అయి ఉండాలి.. ఆర్ఎస్ ప్రవీణ్ సెటైర్లు

by Javid Pasha |
గ్రామాల్లోని రోడ్లపై నడవాలంటే జిమ్నాస్ట్ అయి ఉండాలి.. ఆర్ఎస్ ప్రవీణ్ సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని గ్రామాల్లో ఉన్న రోడ్లపై నడవాలంటే జిమ్నాస్ట్ అయి ఉండాలని సెటైర్లు వేశారు. పెద్దపెల్లి జిల్లాలో పర్యటిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడి రోడ్ల దుస్థితిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని అన్నారు.

కేసీఆర్ ఫాంహౌజ్, బంగళాలకు అద్దం లాంటి రోడ్లు వేసుకుంటే సరిపోదని, ప్రజలకు కూడా అలాంటి రోడ్లు వేయాలన్నారు. ఒక్కసారి బయటకు వచ్చి తెలంగాణ గ్రామాల్లో ఉన్న రోడ్ల పరిస్థితిని చూడాలని సీఎం కేసీఆర్ ను కోరారు. వానాకాలం వచ్చిందంటే రోడ్లపై నడిచే పరిస్థితి లేదని, ఇప్పటికైనా రోడ్లను బాగు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story