RTC కార్మికుల జీవితాలు ప్రమాదంలో ఉన్నయ్: RSP

by Web Desk News |
RTC కార్మికుల జీవితాలు ప్రమాదంలో ఉన్నయ్: RSP
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా రవాణాలో భాగంగా ప్రజలను ఒకచోట నుండి మరొక చోటికి సురక్షితంగా చేరవేసే ఆర్టీసీ కార్మికులు ప్రమాదపు అంచున జీవిస్తున్నారని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం ఓ ఆర్టీసీ కార్మికుడితో ముచ్చటించి, వారి యోగ క్షేమలు తెలుసుకున్నారు. అనంతరం ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ''ఇప్పుడే ఒక RTC కార్మిక సోదరున్ని కలవడం జరిగింది. కేసీఆర్, టీఆర్ఎస్ నిరంకుశ విధానాల వల్ల దాదాపుగా 50,000 మంది కార్మికుల జీవితాలు ప్రమాదం అంచున ఉన్నాయి. 12-14 గంటల పని, అరకొర జీతాలు, అలసట, వీటన్నింటి వల్ల కార్మికులు కళేబరాలుగా మారిండ్రు. కార్మికులారా, మన బహుజన రాజ్యం తెచ్చుకుందాం రండి.'' అని ట్వీట్ చేశారు. అంతేగాక, రాజ్యాంగ హక్కుల పట్ల కార్మిక సోదరులకు అవగాహన లేకపోవడం వల్ల దొర అహంకారంతో ఆర్టీసీ సోదరుల జీవితాలను ఆగం చేస్తున్నారని నెటిజన్లు ఆయన పోస్టును రీట్వీట్ చేస్తున్నారు.

https://twitter.com/RSPraveenSwaero/status/1499247450577850368?s=20&t=Jyxn1t8sWGl3itRbpyHrCw

Advertisement

Next Story