విపక్షాల భేటీకి మాయావతి దూరం.. టీ-కాంగ్రెస్‌తో పొత్తుకు ఆర్‌ఎస్పీ ఆసక్తి!

by GSrikanth |   ( Updated:2023-06-23 07:50:40.0  )
విపక్షాల భేటీకి మాయావతి దూరం.. టీ-కాంగ్రెస్‌తో పొత్తుకు ఆర్‌ఎస్పీ ఆసక్తి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బహుజన సమాజ్ పార్టీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. జాతీయ స్థాయిలో బీఎస్పీ అధినేత్రి మయావతి పలు అంశాల్లో బీజేపీకి మద్దతు తెలిపారు. గతంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టినప్పుడు ఆమె బీజేపీకి మద్దతునిచ్చారు. తర్వాత ఆమె ఇటీవల రాష్ట్ర పర్యాటనలో భాగంగా హైదరాబాద్‌లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో సభ నిర్వహించినప్పుడు ఆమె కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కానీ, బీజేపీపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీంతో మాయావతి బీజేపీకి సపోర్ట్ ఇస్తుందని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

శుక్రవారం(నేడు) బిహార్ రాజధాని పాట్నాలో దేశవ్యాప్తంగా ఎన్డీయే పాలన వ్యతిరేకంగా ప్రధాని మోడీకి, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఓ కూటమి నిర్మించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. పట్నాలో కాంగ్రెస్, డీఎంకే, ఆప్, టీఎంసీతో పాటు పలు విపక్ష పార్టీలు సమావేశమవుతున్నాయి. బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆహ్వానం మేరకు ఆయా పార్టీలు సమావేశమవుతున్నాయి. ఇందులో తొలిసారి రాహుల్, మమత, కేజ్రీవాల్ వంటి నేతలు ఒకే వేదికపైకి రాబోతున్నారు. ఈ మెగా విపక్ష భేటీకి దాదాపు 20 పార్టీల నేతలు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహం రూపొందించే లక్ష్యంతో ఆయా పార్టీలు సమావేశమవుతున్నాయి.

ముఖ్యంగా విపక్షాల్లో ఎవరెక్కడ బలంగా ఉంటే వారితో మిగతా విపక్ష పార్టీలు పోటీ పడకుండా మద్దతిచ్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే, ఈ విపక్షల భేటీకి బీఆర్‌ఎస్‌, బీజేడీ, బీఎస్పీకి ఆహ్వానం అందలేదు. దీంతో బీఎస్పీ పార్టీ బీజేపీ మద్దతు ఇస్తున్నట్లు మరింత బలపడుతుంది. కానీ, తెలంగాణలో బీఎస్పీ పార్టీ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను విమర్శిస్తూనే ఉంది. బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ పార్టీ నేతలకు వ్యతిరేకంగా బీఎస్పీ నాయకులు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్లు బీఎస్పీ అధినేత మాయావతి స్పష్టమవుతుంది. కానీ ఇక్కడ రాష్ట్ర నాయకులు మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో రెండు, మూడుసార్లు ఒక ప్రైవేట్ హోటల్‌లో సీక్రెట్‌గా కలిసినట్లు సమాచారం. వీరిద్దరి మధ్య పొత్తుల చర్చలు జరిగినట్లు తెలిసింది. దీంతో తెలంగాణ బీఎస్పీ పార్టీ టీ-కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్దమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కానీ కేంద్రంలో మాయావతి కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలను విమర్శిస్తూ.. బీజేపీకి మద్దతునిస్తుండగా.. తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ మాత్రం తెలంగాణ కాంగ్రెస్‌తో ఫ్రెండ్ షిప్ చేస్తూ పొత్తు పెట్టుకోవాలనే అలోచనలో ఉంది. దీనిపై బీఎస్పీ జాతీయ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది ఎన్నికల వరకు వేచి చూడాలి.

Also Read..

స్టేట్‌పై బీజేపీ హైకమాండ్ ఫోకస్.. ఢిల్లీకి ఈటల, రాజగోపాల్ రెడ్డి!

Advertisement

Next Story

Most Viewed