- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన BSP చీఫ్ మాయవతి కాన్వాయ్!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీఎస్పీ ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌లోని సరూర్ నగర్ స్టేడియంలో ‘‘తెలంగాణ భరోసా యాత్ర’’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా బీఎస్పీ చీఫ్ మాయవతి హాజరుకానున్నారు. ఇందులో భాగంగా ఇవాళ బీఎస్పీ చీఫ్ మాయవతి హైదరాబాద్‌కు వచ్చారు. బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మాయవతికి రాష్ట్ర బీఎస్పీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బేగం పేట్ ఎయిర్ పోర్టు నుండి మాయవతి పార్క్ హాయత్ హోటల్‌కు బయలు దేరారు.
అయితే, మార్గమధ్యంలో బేగంపేట్ ఫ్లైఓవర్‌పై మాయవతి కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఆమె వెళ్తోన్న సమయంలో బేగంపేట్ ఫ్లైఓవర్‌పై యాక్సిడెంట్ జరగడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో మాయవతి కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. దీంతో ఆమె తిరిగి హోటల్‌కు బయలుదేరారు. కాగా, హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో బీఎస్పీ నిర్వహించనున్న తెలంగాణ భరోసా యాత్ర సభకు ముఖ్య అతిథి హాజరయ్యేందుకు వచ్చిన మాయవతి.. రెండు రోజుల పాటు తెలంగాణలోనే ఉండనున్నారు.