- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఎస్పీ-బీఆర్ఎస్ పొత్తుకు బ్రేక్.. ఆర్ఎస్పీ రాజీనామా వేళ బీఎస్పీ సంచలన ప్రకటన
దిశ, డైనమిక్ బ్యూరో:బీఎస్పీ పార్టీ తెలంగాణ చీఫ్ పదవికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసినట్లు ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడింది. రాబోయే పార్లమెంట్ ఎన్నిక్లలో ఈ రెండు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు ఉండబోదని బీఎస్పీ సెంట్రల్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్ ట్వీట్ చేశారు. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆదేశాల మేరకు లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఎస్పీ, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి ఎన్నికల పత్తు ఉండదని అలాగే మరో ఇతర పార్టీతోనూ పొత్తు లేదన్నారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నది క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి - బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు UP మాజీ ముఖ్యమంత్రి బహన్ కుమారి మాయావతి గారి ఆదేశాలమేరకు త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో BSP , BRS మధ్య ఎలాంటి ఎన్నికల పొత్తు ఉండదు. అదేవిధంగా మరే ఇతర పార్టీతో కూడా పొత్తు ఉండదు.
— Manda Prabhakar BSP (@bsp_prabhakar) March 16, 2024